ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
Mon Jun 02, 2025 09:17 Politics
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కల్పించింది.. ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. సాధారణ బదిలీల గడువును జూన్ 9 వరకు పొడిగించారు. కొన్ని శాఖల్లో ఇంకా బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మే 15న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారంతో గడువు ముగియాల్సి ఉంది.. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మే 15న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.. ఆర్థికశాఖ మే 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలకు అనుమతి ఇచ్చింది. బదిలీల్లో అర్హతలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పుడు మరో ఏడు రోజుల పాటు అవకాశం కల్పించారు.
కొన్ని నిబంధనలు కూడా విధించారు.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించారు. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని కూడా బదిలీ చేస్తారు. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగుల వ్యక్తిగత విన్నపాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే ఏడాది మే 31లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.
ట్రైబల్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. ఆరోగ్య కారణాల వల్ల ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తే బదిలీ చేస్తారు. వితంతు ఉద్యోగుల వినతి మేరకు కూడా బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తుంది. బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #APGovtEmployees #FestivalBonus #June9Deadline #APGovernment #GoodNews #EmployeeWelfare
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.